కనకదుర్గ మాత

భద్రాచలం

అన్నవరం

మహా నంది

తిరుపతి

Previous Next
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
సాయినాథుని దినచర్య
ప్రత్యక్షదైవంగా హిందువుల పూజలందుకుంటున్న షిర్డీ సాయిబాబా జీవనశైలి యోగులందరికి ఆదర్శప్రాయంగా ఉండేది. ఆ జీవనశైలి సామాన్య మానవులకు ఆచరణ సాధ్యం కానిది. ఆయన దినచర్య ఎలా ఉండేదంటే...
Read more
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయక రాజాధి రాజా
"సర్వేజనా సుఖినోభవంతు -లోకా సమస్తా సుఖినోభవంతు".
"అందరిలో ఉన్న బ్రహ్మ ఒక్కడే -అదే దైవ శక్తీ -అదియే సాయి శక్తీ "
సాయి శక్తీని పొందుటకు మనం అందరం కృషి చేద్దాం!!
Read more
మనసే మందిరంగా చేసి సాయిని ఆరాధిద్దాం!!
షిర్డీ నివాసాయ! సాయినాథాయ మంగళం!
భావం:
సాయిబాబాకు ఆర్భాటాలు, ఆడంబరాలు అక్కర్లేదు. నిండైన మనసు చాలు. మనసునే మందిరంగా చేసి సాయిని ఆరాధిద్దాం. సాయిబాబా పాదాలను ఆశ్రయించడమే ఆరాధన. మనసులో నిరంతరం బాబాను తల్చుకోవడమే నివేదన.
షిర్డీ నివాసాయ! సాయినాథాయ మంగళం!
షిర్డిక్షేత్ర నివాసాయ, సిరిసంపదదాయినే!!
సిద్ధి మంత్రస్వరూపాయం సాయినాథాయ మంగళం!!
భావం:
షిర్డీలో నివసించే సాయినాథా, సర్వసిరిసంపదలు ప్రసాదించే సాయిదేవా నీకు నిత్యజయ మంగళం. అన్నిటికన్నా అతిపవిత్రమైన నామం కలిగిన దేవా! నీకు మా ప్రణామములు, ఈశ్వర్, అల్లా అని పేర్లు కలిగి ఉన్న దేవా అందరినీ కాపాడు తండ్రీ!
సాయిబాబాకు ఆర్భాటాలు, ఆడంబరాలు అక్కర్లేదు. నిండైన మనసు చాలు. మనసునే మందిరంగా చేసి సాయిని ఆరాధిద్దాం. సాయిబాబా పాదాలను ఆశ్రయించడమే ఆరాధన. మనసులో నిరంతరం బాబాను తల్చుకోవడమే నివేదన.
సాయిబాబాకు భక్తుల గురించే ధ్యాస. మనని భవబంధాలనుండి ఎలా విముక్తుల్ని చేయాలి, అశాశ్వతమైన అనుబంధాల నుండి ఎలా బయట పడేయాలి, ఆధ్యాత్మిక చింతన పెంచి జీవితాన్ని సార్ధకం చేయాలి అనే ఆయన చింత. భగవంతుడు మనిషికి అవసరమైనవన్నీ ఇచ్చి భూమ్మీదకు పంపాడు. మరి అలాంటప్పుడు భగవంతుడు తాను ఇచ్చిన ఆస్తులను, మానవులు సవ్యంగా ఖర్చు పెట్టాలని ఆశిస్తాడు కదా. కనుక మనం దేన్నీ దుర్వినియోగం చేయకూడదు. మనకు ఉన్న ఆస్తులను సద్వినియోగం చేసుకుంటూ, తోటివారికి ఉపయోగపడుతూ, జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి.

వివిధ సందర్భాల్లో సాయిబాబా అన్న మాటలు గుర్తుచేసుకుందాం...
ప్రజల్ని సన్మార్గంలో పెట్టమని భగవంతుడు నన్ను పంపాడు. కానీ, ఈ రోజుల్లో ప్రజలు కాస్తయినా దేవుడిపట్ల భక్తిశ్రద్ధలు లేకుండా కాలం గడుపుతున్నారు. క్షణికమైన మొహావేశాల్లో పడి కొట్టుకుపోతున్నారు. సత్సంగాలపై ధ్యాస, నమ్మకం లేవు. సత్యం మాట్లాడుతూ, ధర్మాన్ని ఆచరించమంటే, అసత్యాలు చెప్తూ, అధర్మంలో తేలుతున్నారు. భక్తిభావన నిలుపుకుంటే మీకే శ్రేయస్కరం. నా ప్రయత్నాన్ని నేను చిత్తశుద్ధితో చేస్తాను.
పుడుతున్నాం. తింటున్నాం. కాలయాపన చేస్తున్నాం. పుట్టడం, ఆయుష్షు ఉన్నంతవరకు జీవించడం - ఇదేనా జీవితం? ఇందులో ఏమైనా జీవితపరమార్ధం ఉందా? మన జీవితానికి గమ్యం అంటూ ఉండనవసరం లేదా? సరైన, నిర్దుష్టమైన గమ్యాన్ని నిర్ణయించుకుని దాన్ని చేరేందుకు ప్రయత్నించాలి. మనిషి తనను తాను తెలుసుకోలేనంతవరకూ, గమ్యాన్ని నిర్దేశించుకునేంతవరకు జ్ఞానం లేనట్లే. గమ్యం తెలిసివాడే జ్ఞాని. సద్గురువు బోధనలు వింటే, వాటిని పాటిస్తే జీవితం సార్ధకమౌతుంది.

పుట్టినవారు గిట్టకమానరు. అందరూ మట్టిలో కలిసిపోవలసిందే. అయితే, చావుపుట్టుకల మధ్య ఉన్న జీవితాన్ని సార్ధకం చేసుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది. తోటివారితో వీలైనంత వినయవిధేయతలతో మాట్లాడాలి. జలసాలు, విలాసాలకు దూరంగా నిరాడంబరంగా గడపాలి.
''ఇంద్రియాలను అదుపులో ఉంచుకో
సౌశీల్యాన్ని, సౌజన్యాన్ని అలవర్చుకో
ఎక్కువగా మాట్లాడకు
ఎదుటివారు చెప్పేది విను
సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించు
వంతులు, వాడులాతలు వద్దు
అహంకారాన్ని విడిచిపెట్టు
కోపతాపాలకు దూరంగా ఉండు
దేనిమీదా ఇష్టాన్ని పెంచుకోకు
దేన్నీ ద్వేషించకు
మనోవికారాలకు దూరంగా
నిర్వికారంగా ఉండటం అలవర్చుకో
శ్రద్ధ, సబూరీలను సమర్పించు
ఇదే నిజమైన గురుదక్షిణ''
ఇవన్నీ సాయిబాబా సూక్తులు. అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు ఎంత స్పష్టంగా ఉన్నాయి కదూ! ఆచరించేందుకు ప్రయత్నించండి.

ఇలా 40 రోజులు సాయిబాబా మంటపాన్ని శుభ్రం చేస్తూ.. అక్కడ ఇచ్చే ప్రసాదాన్ని ఉన్నంతలో కాసింత దానం చేసి తాను తింటే ఆర్థిక సమస్యలు, ఈతిబాధలు పరిష్కారమవుతాయని పురోహితులు అంటున్నారు.
Read more
సాయిబాబా ప్రబోధనలు
సాయిబాబా మనలో ఉన్న ఈర్ష్య, అసూయ, కామం, మోహం లాంటి దుర్గుణాలను పోగొట్టుకోమని పదేపదే చెప్పేవాడు. స్వార్థం తగ్గించుకుని ఆధ్యాత్మిక చింతన పెంచుకోమని హితబోధ చేశాడు. ప్రేమ భావాన్ని పెంచుకోమని ప్రబోధించాడు. తోటివారితో ప్రేమగా మసలుకోమని, జంతుజాలాన్ని కూడా ఆదరించమని చెప్పేవాడు.
Read more
ప్రశాంతత చేకూర్చే షిర్డీ సాయి
జీవితాన్ని సముద్రంతో పోల్చారు. సాగరంలో ఆల్చిప్పలు మొదలు రత్నాల వరకూ, చేపలు మొదలు తిమింగలాల వరకూ ఎన్నో నిక్షిప్తమై ఉంటాయి. సముద్రం నిరంతరం కల్లోలంగానే ఉంటుంది. అలాగే జీవితం కూడా ఎప్పుడూ అలజడిగా, అల్లకల్లోలంగా ఉంటుంది.
Read more
శ్రీ సాయి జనన కథనం
శ్రీమదనంతకోటి బ్రహ్మాండనాయక, రాజాధిరాజ, యోగిరాజ, పరబ్రహ్మా, శ్రీమత్ సచ్చిదానంద సమర్ధ సద్గురు శ్రీ సాయినాథ మహరాజ్ వారు `పత్రి' అనే గ్రామంలో ప్రభవించారనీ, బాల్యంలోనే ఒక ఫకీరుకు అప్పగించబడినారని, కొంతకాలం తరువాత `సేలూ' గ్రామంలోని ``వెంకూసా'' అనే సద్గురువును కలసి, వారి సహచర్యం వలన సమస్త శక్తులనూ పొంది `షిరిడీ' గ్రామంలో ఆయన చరణం మోపారనీ ఒకానొక కథ ప్రచారంలో వుంది.

ఈ కథను మొట్టమొదటిసారిగా ప్రకటించినవాడు మహారాష్ర్టలోని ప్రముఖ హరిదాసు, శ్రీ సాయిలీలా ప్రచారకుడూ అయిన దాసగణుడే కావడం వలన అనేకానేక మంది దానిని విశ్వసించక తప్పలేదు. ఆ విశ్వాసంతోటే ``పత్రీ గ్రామ సముద్భూతం'' వంటి అష్టకాలు వగైరా రచించబడిపోయాయి. కాని, కొన్ని కొన్ని సందర్భాలలో శ్రీ సాయిబాబా ``నేను-సేతా నుంచి షిరిడీ వచ్చాను. నా గురువు పేరు వెంకూసా'' అని, తనతో చెప్పిన ముక్కలను బట్టి, ఈ శ్రీ సాయీ జన్మ రహస్యగాథను తానే స్వయంగా కల్పించాననీ, ఇది కట్టుకథే తప్ప యదార్ధమనేందుకు ఏ విధమైన ఆధారాలు లేవనీ, అదే దాసగణు అంగీకరించడం జరిగిందని గురు స్ధానీయులైన శ్రీ ఎక్కిరాల భరద్వాజగారు తమ రచనలలో బాహాటంగా ప్రకటించారు. అదీగాక, బాబా సాయిశరణానందతో తన గురువు పేరు రోషన్షా అనీ హెచ్.వి.సారేతో ఏదో షా అనీ చెప్పారట.
ఏది ఏమైనా ఒక విషయాన్ని చెప్పినవాడే తను చెప్పింది అబద్ధమనీ, కల్పన అనీ ఒప్పుకుంటుంటే ఇక దానిని నమ్మేవారెవరూ వుండరు కదా! కాని ఈ ఆలోచనలన్నింటినీ పూర్వవాదం చేసే ఒకానొక వినూత్న ఉదంతం ఇటీవలనే జరిగింది. కేవలం భారతదేశంలోనే గాక అఖిల ప్రపంచంలోనూ కూడా `భగవాన్'గా ఆరాధించబడుతున్న శ్రీ పుట్టపర్తి సత్యసాయిబాబా ది 28-9-1990న శ్రీ షిరిడీ సాయి జన్మను గురించి ఒక అద్భుతమైన విషయాన్ని వెలువరించారు.

షిరిడీసాయి జన్మరహస్యంపై పుట్టపర్తి సాయి ప్రవచనం :
నైజాం రాష్ర్టంలో మారుమూలనున్న కుగ్రామం ప్రతి. ఆ పత్రీ గ్రామంలో గంగా భవాఢ్యుడు, దేవగిరియమ్మ అనే దంపతులుండేవారు. దేవగిరియమ్మ గౌరీ భక్తురాలు. ఆమె భర్త ఈశ్వరభక్తుడు. ఈ దంపతులిద్దరూ పార్వతీ పరమేశ్వరుల పూజను నిరంతరం చేస్తూనే ఉండేవారు. దేవగిరమ్మ భర్త గంగాభవాఢ్యుడు పడవలు నడుపుకుంటూ తన ``జీవనయాత్ర''ను గడుపుతూ వుండేవాడు. వర్షాకాల మగుట చేత, గంగ ఉప్పొంగుట చేత గట్టున పడవలు కొట్టుకొని పోతాయేమో అని భార్యతో చెప్పి, ఆనాటి రాత్రికి యింటికి రాకుండా పడవలను భద్రంగా చూసుకుంటానని చెప్పినాడు. భర్త కోరిక ప్రకారం ఏడు గంటలకే అతనికి భోజనం పెట్టి పంపించి, తాను కూడా ఏడు గంటలకే భుజించింది. తొమ్మిది గంటల సమయమందు తలుపు కొట్టిన శబ్దం విని, తన భర్త తిరిగి వచ్చినాడేమో అని ఆతృతతో తాను పోయి తలుపు తెరచింది దేవగిరియమ్మ.

విత చరిత్ర ప్రవచనం సందేశాలు :
ఎవరో ఒక వృద్ధుడు లోపల ప్రవేశించాడు ``అమ్మా! బయట చలి చాలా తీవ్రంగా వుంది. లోపల నాకు కాస్త పడుకునేందుకు చోటు ఇవ్వమని అడిగాడు. ఆమె చాలా ఉత్తమురాలు. కనకనే వరండా లోపలికి పరుపు తెచ్చి యిచ్చి, అక్కడ పడుకోమని చెప్పి ఆమె తన తలుపువు వేసుకుని లోపలికి వెళ్ళిపోయింది. కొంతసేపు అయిందో లేదో తిరిగి ఆ వృద్ధుడు తలుపులు తట్టాడు. ఆమె తిరిగి తలుపులు తెరిచింది. ``అమ్మా! నాకు చాలా ఆకలిగా వుంటున్నది. ఇంత అన్నం పెట్టు అన్నాడు. ఆమె యింటిలో వెతికి కొంచెం పిండిని పెరుగులో కలిపి యిచ్చింది. తిరిగి ఆమె తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళింది. ఆ వృద్ధుడు ఆమెతో ``తల్లీ! నాకు కాళ్లు నొప్పులుగా వుంటున్నాయి కొంచం ఒత్తుతావా అన్నాడు. ఈ మాటలు వినగానే ఆమె లోపలికి పోయి పూజాగదిలో కూర్చుని, తల్లీ ఏమిటమ్మా ఈ పరీక్ష నాకు. ఈ సమయంలో నేనేమి చేసేది. అతని సేవ చేసేదా లేక అతనికి విరుద్ధంగా వుండేదా'' అని చాలా బాధపడుతూ అటువంటి పరిస్ధితిని తప్పించుకుని ఎందుకీ పరిస్ధితిని కల్పించావని పార్వతీదేవిని వేడుకుంది.

ఆమె ఏదో ఆలోచిస్తూ వుంటుంటే మళ్ళీ తలపుతట్టిన శబ్దమయ్యింది. కాని ఈసారి మాత్రం వెనుక తలుపు నుండి ఒక స్త్రీ వచ్చింది. ``అమ్మా ఒక ముసలాయనకు సేవ చేయాలట గదా! ఎవరికి సేవలు చెయ్యాలి?'' అని పలికింది. తాను ప్రార్ధించిన తన పార్వతీదేవియే ఈ వచ్చిన స్త్రీని పంపిందని చాలా ఆనందాన్ని పొంది ఆ వచ్చిన స్త్రీని వృద్ధుని సేవ నిమిత్తమై వరండాలోకి పంపించి, ఆమె తలుపులు వేసుకుంది.
అక్కడికి వచ్చిన ముసలాయన, ఇప్పుడు వచ్చిన స్త్రీ శివపార్వతులు. వీరిద్దరు ఒకరితో ఒకరు ఈ విధంగా మాట్లాడుకోవడం జరిగింది. ``పార్వతీ! ఆమె మనోభీష్ఠమును నెరవేర్చు'' అని ఈశ్వరుడు చెప్పాడు. వెంటనే పార్వతి ఈశ్వరుని అడిగింది. ``మీరు పరమేశ్వరులు కదా! మీరే అనుగ్రహించండి. వెంటనే ఈశ్వరుడు ``నేను ఈమెను పరీక్షించడం కోసం వచ్చిన వాడను. నీవు ఆమె ప్రార్ధన విని వచ్చినదానవు. కనుక, నీవే ఆ వరాలు అందించు'' అన్నాడు.

తిరిగి తలుపు తట్టిన శబ్దం విని `` ఆ స్త్రీ వుంది కదా'' అని ఆమె ధైర్యంతో తలుపు తెరచింది. వారిద్దరూ పార్వతీపరమేశ్వరుల రూపాల్ని ధరించి దర్శనమిచ్చారు. దేవగిరియమ్మ ఈ ఆనందాన్ని భరించలేకపోయి, అమితమైన సంతోషముతో వారి పాదాలపైన పడింది. అప్పుడు పార్వతి ఇలా ఆశీర్వదించింది. ``వంశోద్ధారకుడైన ఒక కుమారుడిని, కన్యాదానము చేయుటకు ఒక కుమార్తెను - నీకు అనుగ్రహిస్తున్నాను'' అని చెప్పింది. దేవగిరియమ్మ వెంటనే ఈశ్వరుని పాదాలపైన పడింది. ``అమ్మా! నీ భక్తికి సంతోషించాను. ఏ మూడవ గర్భంలో నేను వచ్చి పుడతాను'' అని దీవించాడు ఈశ్వరుడు. ఈ విధంగా నమస్కారం చేసి లేచి చూసేటప్పటికి ఆ ఇద్దరూ అదృశు్యలయ్యారు.
తెల్లవారేటప్పటికి ఆమె భర్త ఇంటికి వచ్చాడు. రాత్రి జరిగినదంతా ఆమె పూస గుచ్చినట్లు చెప్పింది. ఆమె చెప్పిన మాటల్లో ఆయనకు నమ్మకము కలుగకపోవుట చేత ``దేవగిరీ! ఏమిటి నీకీ పిచ్చి ఏదో కల వచ్చింది కాబోలు. పార్వతి ఏమిటి? పరమేశ్వరుడేమిటి? అని ఈ విధంగా ఆమెను హేళన చేసుకుంటూ వచ్చాడు. అతనికి నమ్మకం కలుగలేదు.
కొంతకాలం గడిచిన తరువాత దేవగిరమ్మ గర్భం ధరించింది. అనుకున్న విధంగానే కుమారుడు పుట్టాడు. ఇంకొక సంవత్సరమైన తర్వాత కుమార్తె పుట్టడం జరిగింది. తన భార్య చెప్పిన ఈ రెండు విషయాలూ ప్రత్యక్షంగా నిరూపణ కావడం చేత నిజంగా పార్వతీ పరమేశ్వరులు ఆమెకు దర్శనమిచ్చారని విశ్వాసాన్ని పొందాడు. ``నీకు ఈ ప్రాప్తి సంభవించింది. నాకు ఆ ప్రాప్తి లభించలేదు'' అని గంగాభవాఢ్యుడు తన భార్యతో అన్నాడు.

తన భార్య వలే తాను కూడా పార్వతీపరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలన్న కోరిక, దీక్ష కలిగింది. ఆ తర్వాత ఈమెకు మూడవ గర్భం ప్రారంభమయ్యింది. ఈ దృశ్యాన్ని కూడా నిదర్శనంగా గమనించుట వలన ఇతని మనసు మాయ నుండి విడిపడి చాలా చాలా మార్పు చెందుతూ వచ్చింది. ఎప్పుడెప్పుడు ఇల్లు విడిచిపెట్టి పోవాలి? ఎప్పుడు తపస్సు చేయాలి? ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలి? అనే ఆలోచన. అందుచేత అతడు దానికోసం దీక్ష పట్టాడు. ఈమెకు నవమాసాలు నిండిపోయాయి. ఆ సమయమందే ``నేను అరణ్యాలకు వెళ్ళిపోతాను'' అని భార్యతో చెప్పాడు.
దేవగిరమ్మ కూడా భర్త వెంట బయలుదేరింది. కొంత దూరం పోగానే ఈమెకు ప్రసవవేదన ఎక్కువయ్యింది. ఆ మార్గమధ్యములోనే (ది 28/9/1835న) ప్రసవించింది. ఆ బిడ్డయే శ్రీ సాయిబాబా. తన బిడ్డను చీరగుడ్డ మీద పడుకోబెట్టి ఆ దారి మధ్యలోనే పెట్టి ఈమె కూడా భర్త వెంటనే వెళ్ళిపోయింది. కనుకనే, ఈ పిల్లవానికి తల్లి ఎవరు? తండ్రి ఎవరు? అనేది ఎవరికి తెలియదు. ఆనాడు ఈ బిడ్డ ఒక ఫకీరుకు కనిపించుట చేత, ఆ ఫకీరు ఆ పసిబిడ్డను తెచ్చుకున్నాడు.

సుమారు నాలుగు సంవత్సరాల పాటు, 1839 దాకా ఆ పసిబిడ్డడు ఫకీరు యింటనే పెరిగాడు. కాని నాలుగవ ఏట 1839లో ఆ ఫకీరు చనిపోయాడు. ఏకాకియైన ఆ ఫకీరు భార్య ఈ పాపడిని మాత్రం ఎంతో ప్రేమగా పెంచుకోసాగింది. అయితే అప్పటికే ఈ కురవ్రాడి చేష్టల వలన గ్రామంలో హిందూ ముస్లిం కలహాలు మరింత ప్రజ్వరిల్లే పరిస్ధితి ఏర్పడింది.
ఆ అనాధ బాబు హిందూ దేవాలయాలకు వెళ్ళి మహమ్మద్ ప్రవక్త గురించి ప్రవచించేవాడు. ``మై అల్లాహూ'' (నేనే దేవుణ్ణి) అనేవాడు ఒక్కొక్కసారి ``అల్లా మాలిక్'' (దైవమే సర్వాధికారి) అనేవాడు. అనంతరం మసీదులోకి వెళ్ళి ``రాముడే అల్లా - శివుడే దేవుడు'' అని వెర్రికేక లేసేవాడు. హిందువుల యింటబుట్టి ఫకీరు యింట పెరిగిన ఈ కురవ్రాణ్ణి ఎవరూ ఏమీ అనలేక పెంపుడు తల్లి అయిన ఫకీరు భార్యకు ఫిర్యాదు చేశారు. ఆ బిడ్డను దారిలో పెట్టలేకపోయిన ఆ తల్లి అతనిని చేరువలో ఉన్న ``వెంకుసా'' అనే సద్గురువుకు అప్పగించింది. ఆ సద్గురువు ఆశ్రమంలో పన్నెండు సంవత్సరాల పాటు ఉన్నాడా బాలుడు. ఆ పన్నెండేళ్ళలోనూ గురుశిష్యుల మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడి పోయింది. శరీరాలు వేరుగాని వారి ఆత్మలు ఒక్కటే అయిపోయాయి. అయినప్పటికి సుమారు పదహారు సంవత్సరాల వయసులో అనగా క్రీ.శ. 1851లో సద్గురు ఆశ్రమాన్ని విడిచి దేశాటనం చేస్తూ శిరిడీ గ్రామం చేరుకున్నాడు.

రెండు నెలలపాటు శిరిడీలో గడిపిన అనంతరం పుహదేశాటనం చేస్తూ ఎటో వెళ్ళిపోయారు. మళ్ళీ చాంద్భాయి పోటీలు బంధువుల పెళ్ళి నిమిత్తమై ఆ పెళ్ళివారితో కలిసి శిరిడీ చేరడం. తర్వాత 1918 విజయదశమి నాడు సమాధి చెందే పర్యంతం దాదాపు సంవత్సరాల పాటు ఆయన శిరిడీలోనే ఉండిపోయాడు. ఇది అసలు కథ.
Read more
సాయి సచ్చరిత్రను పాట రూపంలో తెలిపే "సాయి నక్షత్ర మాలిక"
శ్రీ షిరిడి సాయి సచ్చరిత్రను "నక్షత్ర మాలిక" గా ఎవరో సాయి భక్తుడు వ్రాసాడు. మనకున్న 27 నక్షత్రాల లాగ ఈ పాటకు 27 చరణాలున్నాయి. ఈ పాటకు బాణీ శ్రీ జేసుదాసు గారు పాడిన "సాగర తీర సమీపాన తరగని కావ్య సుధా మధురం" ఆధారం.
Read more ఆరతి సాయి బాబా సౌఖ్య దాతార జీవ : తాత్పర్యం
శ్రీ షిరిడీ సాయిబాబా గారి "ధూప్ ఆరతి" లేదా సాయంకాల ఆరతియైన "ఆరతి సాయి బాబా సౌఖ్య దాతార జీవ" రచించినది శ్రీ మాధవరావ్ వామన రావ్ అద్కర్. ఈ ఆరతిని సాయంకాలమున సుమారు 6 గంటల 15 నిముషాలకు షిరిడీలో ఇస్తారు. మరాఠీ లో రచించబడిన ఈ ఆరతి కి తెలుగు అనువాదం దిగువన ఇస్తున్నాను.
ఇందులో ఏదైనా భావము సరిగ్గా ప్రస్ఫుతించ లేనిచో మీ సలహాలను తెలుపగలరు. ఇది సాయి సందేశాన్ని పదుగురు సాయి భక్తులతో పంచుకునే ప్రయత్నం గా గమనించ గలరు.

ఆరతి సాయి బాబా, సౌఖ్య దాతార జీవ చరణా రాజాతాళీ
ధ్యావా దాసాన్ విసావా, భక్తా విసావా ఆరతి సాయి బాబా
బాబా నీకు ఆరతి చేస్తున్నాము. జీవులందరికీ సంతోషము నొసగి, నీ పాద రేణువులైన భక్తులకు నీ పాదముల వద్ద శరణు నిచ్చే నీకు ఆరతి చేస్తున్నాము.
జాళుని యానంగా స్వ స్వరూపీ రాహే దంగా
ముముక్షు జన దావీ నిజ డోలా శ్రీరంగ, డోలా శ్రీరంగ
ఆరతి సాయి బాబా

కోరికలను దహింప జేసి, తనను తాను తెలుసుకొన గోరే వారికి, మోక్షమును పొందే మార్గము బోధించి, తమ కళ్ళతో తాము విష్ణువుని (శ్రీరంగని) చూడ గలిగెట్లు చేసిన సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.
జయా మనీ జైసా భావ, తయా తైసా అనుభవ
దావిసీ దయాఘనా, ఐసీ తుఝీ హీ మావా, తుఝీ హీ మావా,
ఆరతి సాయి బాబా
ఎవరెవరికెంత నమ్మకము, భక్తి ఉన్నదో, వారికి దానికి తగినంత అనుభవాన్ని ప్రసాదించే, ఓ దయామయా నీవు చూపే మార్గము అదే ఓ దయామయా, నీకు ఆరతి చేస్తున్నాము. (దీనికి సామ్యం గా అన్నమాచార్యులు కూడా ఇలా చెప్పారు: "ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమె నీవు, అంతరాంతరము లెంచి చూడ పిందంటే నిప్పటి అన్నట్లు" అని.)
తుమచే నామ ధ్యాతా, హరే సంస్కృతి వ్యథా
అగాధ తవ కరణీ, మార్గ దావిసీ అనాథ, దావిసీ అనాథ,
ఆరతి సాయి బాబా

నీ నామ స్మరణము ఈతి బాధలను హరిస్తుంది. నీ చర్యలు అగాధమంత లోతైనవి (అంతు పట్టనివి). అవి అనాథలకు దారి చూపుతాయి. బాబా నీకు ఆరతి చేస్తున్నాము.
కలియుగీ అవతార సద్గుణ పరబ్రహ్మ సాచారా
అవతీర్ణ ఝాలాసే, స్వామి దత్తా దిగంబర, దత్తా దిగంబర,
ఆరతి సాయి బాబా
ఈ కలియుగంలో నీవు భూమిపైకి దిగి వచ్చిన నిజమైన పరబ్రహ్మ అవతారానివి. నీవు దిగంబరుడైన దత్తాత్రేయ అవతారానివి. బాబా నీకు ఆరతి చేస్తున్నాము. (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అత్రి మహర్షి పత్నియైన అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి మూడు తలలు గల దత్తాత్రేయునిగా జన్మించాడు)
ఆఠా దివాసా గురువారీ, భక్త కరీతి వారీ,
ప్రభుపద పహావాయా భవభయ నివారీ,
ఆరతి సాయి బాబా

ప్రతి గురు వారం భక్తులు షిరిడీ వచ్చి ఈ ప్రభువు చరణములను దర్శించుకుని, తమ ఇహలోక భయమును పోగొట్టు కొందురు. సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.
మాఝా నిజ ద్రవ్యఠేవ, తవ చరణరజ సేవ
మాగణే హేచి ఆతా తుమ్హా దేవాది దేవా, దేవాది దేవా,
ఆరతి సాయి బాబా
నాకు కావలసిన సంపద అంతా నీ పాద సేవ చేయడమే. ఓ! ప్రభువులకు ప్రభువైన సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.
ఇచ్చితా దీన చాతక నిర్మల తోయ నిజ సూఖ
పాజవే మాధవాయ సంభళ అపూళిభాక, అపూళిభాక
ఆరతి సాయి బాబా
చాతక పక్షి ఎలా అయితే నిర్మలమైన నీరు త్రాగాలను కుంటుందో, ఓ! ప్రభూ, నాకు జ్ఞానాన్ని ప్రత్యక్షంగా ప్రసాదించు. సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.
Read more
వార్తలు
This text will be replaced
This text will be replaced
ముందు మాట

"హిందూ ధర్మ రక్షనాధం హిందువులను చైతన్య పరుద్ధం" http://www.templesdiary.com "భక్తి భావాలకు నిలయాలు, ముక్తి మార్గాలకు సోపానాలు మన దేవాలయాలు" "వాటిని పరిరక్షించుకోవడం మనందరి భాద్యత." సంస్కృతి సంప్రదాయాలకు ప్రతికలు ... మన దేవాలయాలు .ఆధ్యాత్మిక ఆనందానుభూతులకు నిలయాలు ....మన ఆలయాలు వీటి సందర్సన వల్ల...
Read moreఅధ్యాయములు
ఈరోజు
పంచాంగం
రాశి ఫలములు



